ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌– ఇండిగో.. కోబ్రాండెండ్ కార్డ్‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌– ఇండిగో.. కోబ్రాండెండ్ కార్డ్‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌,  ఇండిగో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ కలిసి రూ.1,499 యాన్యువల్‌‌‌‌‌‌‌‌ ఫీజుతో కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చాయి. ఈ కార్డుతో ఏడాదికి  4 డొమెస్టిక్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ (ప్రతి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఒకటి) పొందొచ్చు.  కానీ మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం  రూ.50 వేలు ఖర్చు చేసినవారికే ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వర్తిస్తుంది. 

ఫ్యూయల్ కొనేటప్పుడు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛార్జీ మాఫీ అవుతుంది.  రూ.500–రూ.4 వేల మధ్య  లావాదేవీలపై 1శాతం సర్‌‌‌‌‌‌‌‌చార్జ్ లేదా గరిష్టంగా రూ.200 వరకు మాఫీ పొందొచ్చు.   ఇండిగో యాప్/వెబ్‌‌‌‌‌‌‌‌లో ప్రతీ రూ.100 ఖర్చుపై 3 బ్లూచిప్ రివార్డ్ పాయింట్లు, హోటల్, ట్రావెల్‌‌‌‌‌‌‌‌పై ప్రతి రూ. వంద ఖర్చు చేస్తే  2 బ్లూచిప్‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ పొందొచ్చు.  ఇతర ఖర్చులపై రూ.100కి 1 బ్లూచిప్‌‌‌‌‌‌‌‌ పాయింట్ వస్తుంది. రూ.2,500 పైగా ఖర్చులను ఈఎంఐగా మార్చుకోవచ్చు.