అదరగొట్టిన ఎస్​బీఐ కార్డ్స్

అదరగొట్టిన ఎస్​బీఐ కార్డ్స్

ముంబై: ఎస్​బీఐ కార్డ్స్ సత్తా చాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా బిజినెస్​ను సాధించింది. దాదాపు మూడు లక్షల మంది కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. రెండు లక్షల కార్డులతో యాక్సిస్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌లు ఒక్కొక్కటి 80వేల కార్డులను యాక్టివేట్ చేశాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌‌‌‌ కార్డుల సంఖ్య దాదాపు 60వేలు పెరిగింది. సిటీ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌‌‌‌ఫోలియోను కొనుగోలు చేయడంతో యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ వాటా ఏకంగా 11.7శాతానికి పెరిగింది. ఎస్​బీఐ కార్డ్స్ వాటా 19.8 శాతానికి ఎగిసింది. ఫిబ్రవరిలో హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్‌‌‌‌ల మార్కెట్ వాటాలు కార్డ్స్ వరుసగా 20.8శాతానికి, 16.5శాతానికి తగ్గాయి.

కొత్త కార్డుల యాక్టివేషన్లు ఫిబ్రవరిలో తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి. జనవరిలో కొత్త కార్డుల యాక్టివేషన్లు​ 13 లక్షల వరకు ఉన్నాయి. దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య ఇప్పుడు 8.34 కోట్లకు చేరింది. ఎస్​బీఐ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌లు కలిసి తమ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ పోర్ట్‌‌‌‌ఫోలియోకి దాదాపు 79శాతం కొత్త కార్డ్‌‌‌‌లను యాడ్ చేసుకున్నాయి. జనవరిలో ఎక్కువ బేస్ ఫిబ్రవరిలో తక్కువ రోజుల కారణంగా కార్డుల వాడకం విలువ కూడా దాదాపు 7శాతం తగ్గి రూ.1.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఎంకే గ్లోబల్ ఎనలిస్ట్ ఆనంద్ దామా మాట్లాడుతూ మర్చంట్ డిస్కౌంట్ రేట్​పై ఆర్​బీఐ నిర్ణయం ఇంకా రాలేదని, ఇది తగ్గితే కార్డ్ కంపెనీలకు నష్టమని అన్నారు. ఐడీబీఐ క్యాపిటల్ రిపోర్ట్ ప్రకారం, కిందటి 12 నెలల్లో, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్ పరంగా తమ మార్కెట్ వాటాను డిసెంబర్ 2021లో 16.1శాతం నుండి డిసెంబర్ 2022లో 19.2శాతంకి పెంచుకున్నాయి. కోటక్ మార్కెట్ వాటా 3.5శాతం నుండి 5.1శాతంకి, ఎస్​బీఐ కార్డ్స్ 20.5శాతం నుండి 21.4శాతంకి  యాక్సిస్ 10.9శాతం నుండి 11.4శాతంకి పెరిగింది.