ఇంటి లోన్ పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ

V6 Velugu Posted on Apr 05, 2021

న్యూఢిల్లీ: ఇంటి లోన్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీని పెంచింది. హోమ్ లోన్ల మీద 25 బేసిస్ పాయింట్స్ (బీపీఎస్) ప్రకారం వడ్డీ రేటును 6.70 శాతం నుంచి 6.95కు పెంచింది. దీంతోపాటు ఇంటి లోన్ల పై ప్రాసెసింగ్ ఫీజును కూడా పెంచింది. పెరిగిన ఇంట్రెస్ట్ రేట్లు ఈ నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. హోమ్ లోన్లపై వడ్డీ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో మిగతా బ్యాంకులు కూడా ఎస్బీఐని అనుసరించొచ్చని తెలుస్తోంది. 

Tagged SBI, home loan

Latest Videos

Subscribe Now

More News