దేశంలో రికార్డ్ స్థాయిలో తగ్గిన నిరుద్యోగం రేటు

దేశంలో రికార్డ్ స్థాయిలో తగ్గిన నిరుద్యోగం రేటు

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం రికార్డ్‌‌‌‌ లెవెల్‌‌‌‌కు తగ్గిందని ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ ప్రకటించింది. అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ రేట్‌‌‌‌ 2022–23 లో 3.2 శాతానికి దిగొచ్చిందని తెలిపింది. 2017–18 లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 6.1 శాతంగా ఉంది. లేబర్ మార్కెట్‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ వాటా  పెరుగుతోందని, 13.6 శాతం నుంచి 18.3 శాతానికి ఇది పెరిగిందని వివరించింది. ఉన్నత చదువులు పెరుగుతున్నాయని, యువతలో వ్యాపారం చేయడం మంచిదనే ధోరణి కనిపిస్తోందని ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ వివరించింది. లేబర్ మార్కెట్‌‌‌‌లో మహిళల వాటా పెరుగుతోందని, 2018లో వీరి వాటా 17.5 శాతం ఉంటే 2023లో 27.8 శాతానికి ఎగసిందని పేర్కొంది.