న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన డెట్ ఇన్‌స్ట్రుమెంట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని ఎస్బీఐ నిర్ణయించింది. దీర్ఘకాలిక బాండ్‌లు, బాసెల్ 3 కంప్లైంట్ అడిషనల్ టైర్ 1 బాండ్‌లు, బాసెల్ 3 కంప్లైంట్ టైర్ 2 బాండ్‌లతోపాటు రూపాయి లేదా ఏదైనా ఇతర కన్వర్టబుల్ కరెన్సీలో నిధులను సేకరిస్తారు.
తన విదేశీ వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చడానికి 10-బిలియన్ డాలర్ల గ్లోబల్ మీడియం నోట్ ప్రోగ్రామ్ కింద ఎస్బీఐ గత నెల కూడా 750 మిలియన్ డాలర్లను సేకరించింది.
