ఓర్వలేకనే రఘునందన్ రావు గవర్నర్​కు ఫిర్యాదు

ఓర్వలేకనే రఘునందన్ రావు గవర్నర్​కు ఫిర్యాదు

సిద్దిపేట టౌన్, వెలుగు: సర్పంచ్ నుంచి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన దళితుడు బక్కి వెంకటయ్యను చూసి ఓర్వలేకనే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గవర్నర్​కు ఫిర్యాదు చేశారని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిషన్ డిస్ట్రిక్​ మెంబర్ భీమసేన ఆరోపించారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత, మైనారిటీ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. 

బీఆర్ఎస్ పార్టీకి బక్కి వెంకటయ్య చేసిన సేవలను గుర్తించి కేసీఆర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా అవకాశం కల్పించారని , పార్టీలో పని చేసినప్పటి ఫొటోలు తీసుకెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రఘునందన్ రావుకు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపే అన్నారు.  

ఇప్పటికైనా రఘునందన్ రావు తన వైఖరి మార్చుకుని కంప్లెయింట్​ వాపసు తీసుకోవాలని, లేనిపక్షంలో దళిత మైనారిటీ బీసీ సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సమావేశంలో దళిత, మైనార్టీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు జెల్లే రాములు, కలిముద్దిన్, గుట్టి సత్యనారాయణ, మెట్ పల్లి నరసింహ, చంద్రకాంత్, కొదాడి శ్రీనివాస్, దార స్వామి, కత్తి రాజేందర్, జక్కుల రాజు, కొమ్మేటి రాజు, ఆసబాబు పాల్గొన్నారు.