స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది ? ఈ డిజార్డర్ వచ్చినట్లుగా కూడా ఆ పర్సన్​కి తెలియకపోవచ్చు !

స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది ? ఈ డిజార్డర్ వచ్చినట్లుగా కూడా ఆ పర్సన్​కి తెలియకపోవచ్చు !

స్కిజోఫ్రెనియా (మానసిక రుగ్మత) ప్రాథమిక దశలో చికిత్స ద్వారా త్వరగా క్యూర్ అవుతుంది. వ్యాధి తీవ్రతరం అయితే జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. స్కిజోఫ్రెనియాపై అవగాహన అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ డిజార్డర్ వచ్చినట్లుగా కూడా ఆ పర్సన్​కి తెలియకపోవచ్చు.  చెప్పినా వారు నమ్మరు. ప్రస్తుత ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో మనిషి ఆలోచన, ప్రవర్తనలో, జీవనశైలిలో చాలా మార్పులు వస్తున్నాయి. వీటితో పాటుగా గతంతో పోలిస్తే ఇప్పుడు మానసిక సమస్యలు కూడా తీవ్రతరం అవుతున్నాయి. 

డిప్రెషన్, సైకోసిస్, ఎక్సైట్మెంట్, ఓవర్ థింకింగ్ లాంటి వ్యాధులకు వయసుతో, జెండర్​తో  సంబంధం లేకుండా అనేకమంది ఈ మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. డాక్టర్​ యూజింగ్ బ్యూ ల్లర్ 1900లో స్కిజోఫ్రెనియా అనే పదాన్ని ఉపయోగించారు. డబ్ల్యూహెచ్ఓ 1986 నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో 20 నుంచి 27 వరకు వరల్డ్ వైడ్  స్కిజోఫ్రెనియా అవేర్నెస్ వీక్​గా నిర్వహిస్తోంది. 

స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది ?
ప్రపంచంలో దాదాపు 200 మిలియన్ల మంది అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.  డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం ప్రకారం వరల్డ్ వైడ్ సుమారుగా ప్రతి 300 మందిలో ఒక్కరిని ప్రభావితం చేస్తుంది.  పెద్దలలో అయితే ఈ రేటు 222లో ఒక్కరికి సంభవిస్తున్నది.  ఇది సాధారణ మానసిక జబ్బుల వలె కాదు.  కౌమార దశలో 20 నుంచి 30సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది.  అయితే ఈ జబ్బు స్త్రీలలో కంటే పురుషులలో 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని సర్వేలు చెబుతున్నాయి.

45% మంది డిప్రెసివ్,  యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్​తో బాధపడుతున్నారు. స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుందంటే...జెనెటిక్, ఫ్యామిలీ, బయోలాజికల్ ఫ్యాక్టర్స్,  న్యూరో కెమికల్స్ అబ్నార్మాలిటీ వల్ల కూడా వస్తుంది.  మెదడులో ఉండే  డొపామైన్​ లాంటి గ్లూటామేట్, సెరటోనిన్  న్యూరో కెమికల్స్ ఇన్ బాలన్స్ వల్ల కూడా వస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. విపరీతమైన మానసిక ఒత్తిడి  కూడా కారణం కావచ్చు.  ఈ డిజార్డర్తో బాధపడుతున్నవారు వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోతారు.

స్కిజోఫ్రెనియా లక్షణాలు
స్కిజోఫ్రెనియా లక్షణాలు  ప్రధానంగా ఐదు రకాలు. భ్రమ(Delution), భ్రాంతి(Helutinations), అస్తవ్యస్తమైన ప్రవర్తన(Cathtonic behavior),  ప్రతికూల లక్షణాలు(Nagative Simtoms),  అస్తవ్యస్తమైన ప్రసంగం(Dis organization speech).  ఈ లక్షణాలు అన్నీ ప్రతి వ్యక్తిలో ఒకలా ఉండవు. కాలక్రమేణా మారుతుంటాయి.  ఒక వ్యక్తి ఆ సంఘటన, విషయం నిజంకాదని స్పష్టంగా తెలిసినా, ఆధారాలు ఉన్నా కూడా వాటిని నమ్మకుండా ఒక అసంబద్ధమైన నమ్మకాన్ని గట్టిగా నమ్ముతూ ఆ భ్రమలోనే ఉంటారు.

స్కిజోఫ్రెనియా బాధితుల్లో 90 శాతం మందిలో ఈ లక్షణం ఉంటుంది.  కాగా, స్కిజోఫ్రెనియా  ముందస్తు లక్షణాలను పరిశీలిస్తే.. డిప్రెషన్​తో  సమాజంతో సంబంధం లేకుండా ఉంటారు.  అనుమానం, విమర్శలకు ఎక్కువగా స్పందిస్తుంటారు. ఆనందం, బాధ, సంతోషం  కూడా వ్యక్తపరచలేరు. అతి నిద్ర లేదా నిద్రపోకపోవడం, మతిమరుపు వేటిమీద ఏకాగ్రత ఉండకపోవటం జరుగుతుంది.

ముభావంగా ఉండడం, ఎవరితో కలవకపోవడం, ఎమోషన్స్ పెద్దగా చూపించలేరు.  ప్రేమ, జాలి, దయ, ఆప్యాయత ఉన్నా వాటిని అవతలివారికి చూపించలేకపోవటం, తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి బయటకు వెళ్లి పనిచేయడానికి ఇష్టపడరు. అంటే ప్లాన్ చేసుకోవడంలో నిర్లక్ష్యం, ఆర్గనైజ్ చేయడంలో  వెనుకబాటుతనం, వారితో వారే మాట్లాడుకుంటారు, సంఘర్షణ పడుతుంటారు.

సరైన ఆలోచనతో సక్రమంగా ఉండలేరు.  ఏకాగ్రతగా ఉండటంలో ఇబ్బంది,  మాట్లాడే విధానంలో మార్పు కనిపిస్తుంటుంది. అడిగిన ప్రశ్నలకు సంబంధంలేని సమాధానాలు చెబుతుంటారు. అశాస్త్రీయమైన విషయాలు మాట్లాడుతుంటారు. మాట్లాడేటప్పుడు విషయానికి సంబంధంలేని అనవసరమైన విషయాలు బాగా మాట్లాడుతుంటారు.

ప్రతికూల లక్షణాలు
రోజువారీ పనుల్లో తగ్గుదల కనిపిస్తుంది. అనవసరమైన వాటికి ఎక్కువగా ప్రతిస్పందిస్తుంటారు. ప్రవర్తనలో రకరకాల  వింతైన మార్పులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలోచనలు నియంత్రించుకోలేకపోవటం. ఫాస్ట్ గా నడవడం, ఒక దగ్గర  ఉండలేరు. నిల్చోలేరు. ఊర్లు తిరగడం,  ఒక ప్లేసులో ఉండలేరు. ఈ లక్షణాలు గలవారు సాధారణ వ్యక్తుల వలె ఉండరు. వీరికి ఆసక్తి, ఉత్సాహం ఉండదు. స్వీయ రక్షణ ఉండదు. పరిసరాలపై అవగాహన ఉండదు. అధైర్యంగా ఉండడం,  సమాజం నుంచి తనకి తానే దూరం అవుతుంటాడు.  వీరు ఎక్కువగా తినడం లేదా తినకపోవడం చేస్తుంటారు.  ఎక్కువగా పడుకోవడం లేదా పడుకోకపోవడం, బాగా ఆలోచిస్తూ ఉంటారు.  విపరీతంగా కోపం ఈ లక్షణాలతో ఎక్కువగా కనిపిస్తారు.

గణిత శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి గ్రహీత జాన్ మార్టిన్-నాష్, ది గ్రేట్ గాడ్స్ బై రచయిత జల్డా ఫిట్జ్ గేరాల్డ్,  బవేరియాకు చెందిన బట్టో రాజు,  ప్రముఖ గాయకుడు గాడ్ ఓన్లీ నోస్,,ఆల్బర్ట్ ఐనిస్టీన్​ కొడుకు,  బర్నాడ్ రసూల్ కుమారుడు,  ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరైన పర్వీన్ బీబీ వీరంతా కూడా స్కిజోఫ్రెనియా బారినపడి చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా బయటపడినవారే.

చికిత్స పద్ధతులు
ఫ్యామిలీ థెరపీ,  గ్రూప్ థెరపీ, యాంటీ సైకోటిక్స్ థెరపీ,  సోషల్ స్కిల్ ట్రైనింగ్, ఒకేషనల్ రిహాబిలేషన్, ECTఎలక్ట్రో కన్వెన్స్లీవ్ థెరపీ DSM-4,  ఫిజికల్ థెరపీ, సైకోథెరపీ,  సీబీటీ  కాంగినేటివ్ బిహేవియర్ థెరపీ సీటీ  కంప్యూటేడ్ టోమోగ్రఫీ, ఎంఆర్ఐ మొదలైన విధానాల ద్వారా చికిత్సను అందించవచ్చు.  సైకలాజికల్ డిజార్డర్స్ గుర్తించినవారు మొదటి దశలోనే  సరైన కౌన్సెలింగ్,  ట్రీట్మెంట్​ తీసుకోవాలి. కౌన్సెలింగ్,  చికిత్స ద్వారా 25% మంది ఈ రుగ్మత నుంచి  బయటపడ్డారు. సరైన ట్రీట్​మెంట్​,  కౌన్సెలింగ్ ద్వారా జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చు.

కె. లక్ష్మి, సైకాలజిస్ట్