బిల్లులు రాలేదని స్కూల్ గేట్కు తాళం

బిల్లులు రాలేదని స్కూల్  గేట్కు తాళం

కోడేరు, వెలుగు: మండల కేంద్రంలోని హైస్కూల్, సీపీఎస్, జీపీఎస్  బిల్డింగ్​ పనులను ‘మన ఊరు–-మన బడి’ కింద కాంట్రాక్టర్లు పనులు చేశారు. వారికి రూ.98 లక్షలకు గాను, రూ.42 లక్షలు మంజూరు కాగా, మిగిలిన బిల్లులు ఇవ్వాలని సోమవారం స్కూల్​ గేట్​కు తాళాలు వేసి నిరసన తెలిపారు.

ఎంఈవో భాస్కర శర్మ ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు అందేలా చూస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం తాళాలు తీయించి స్టూడెంట్లను స్కూల్​లోకి పంపించారు.