టెస్టుల్లో సరిగా రాయలేకపోతున్న స్కూల్​ విద్యార్థులు

టెస్టుల్లో సరిగా రాయలేకపోతున్న స్కూల్​ విద్యార్థులు
  • అసెస్​మెంట్ ​టెస్ట్​ల్లో స్టూడెంట్ల ఇబ్బందులు
  • ఎగ్జామ్స్ ని బట్టి పెర్ఫామెన్స్ తెలుస్తదంటున్న టీచర్లు 

హైదరాబాద్, వెలుగు: కొవిడ్ ​కారణంగా.. స్కూళ్ల బంద్​తో  ఏడాదిన్నర లెర్నింగ్ గ్యాప్ తో స్టూడెంట్స్ బేసిక్స్ కూడా మర్చిపోయారు. ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి ఫిజికల్​గా స్కూళ్ల ఓపెనింగ్​నుంచే  బేసిక్ లైన్ సెషన్స్ కూడా మొదలు పెట్టాలనే సర్కార్​ఆదేశాలతో విద్యార్థులకు అఆ ల నుంచి పదాల వరకు టీచర్లు చెబుతున్నారు. ఇవి చెప్పడానికే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు గడిచిపోయాయి. దీంతో సిలబస్, లెస్సెన్స్ స్టార్ట్ చేసేందుకు లేటు అయింది. ఎగ్జామ్స్ కి ముందు కూడా లెసెన్స్​నే కంటిన్యూ చేశారు. దీంతో రివిజన్ కి కూడా టైం లేకుండా పోయింది. ప్రస్తుతం సమ్మెటివ్ –1 ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఏం రాయాలో, ఎలా రాయాలో తెలియక స్టూడెంట్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఎగ్జామ్స్​కు బదులు అసెస్​మెంట్లు
యూనిట్ టెస్ట్ లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్థానంలో ఫార్మేటివ్ అసెస్​మెంట్​టెస్ట్ లు, సమ్మెటివ్ అసెస్​మెంట్​(నిర్మాణాత్మక మూల్యాంకనం) ఎగ్జామ్స్ లు వచ్చాయి. హాఫ్ ఇయర్లీగా సమ్మెటివ్ – 1 ఎగ్జామ్స్ పెట్టాలని, ఆన్యువల్ ఎగ్జామ్స్ గా సమ్మెటివ్ – 2 నిర్వహించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ లోనే సమ్మెటివ్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్-–1 ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే ఫిజికల్ క్లాసులు లేట్ గా ప్రారంభించడం తో స్టూడెంట్స్ లోని గందర గోళ పరిస్థితుల కారణంగా డిసెంబర్ మొదటివారానికి వాయిదావేశారు. స్కూల్ మేనేజ్​మెంట్ల రిక్వెస్ట్​తో  ఈనెల14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫస్ట్​ క్లాస్ నుంచి టెన్త్​క్లాస్​స్టూడెంట్స్ వరకు ఈ ఎగ్జామ్స్​ కండక్ట్​ చేస్తున్నారు. 

సిలబస్​ తగ్గించినా...
ఎగ్జామ్స్ ఒత్తిడి తగ్గించేందుకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి 70శాతమే సిలబస్ ను గవర్నమెంట్ ప్రకటించింది. అప్పటికే చాలా స్కూళ్లు తీసేసిన సిలబస్ ని కంప్లీట్ చేశాయి. ఇప్పుడు మిగతా 70శాతంలోని లెస్సెన్స్ పై ఫోకస్ పెట్టాయి. చాప్టర్ లో లెసెన్స్​తీసేయకుండా అక్కడక్కడ మాత్రమే తగ్గించారని, దీంతో మొత్తం చెప్పాల్సి వస్తుందని టీచర్లు అంటున్నారు. సిలబస్ అంతా కంప్లీట్ చేయడం తమను కూడా ఒత్తిడికి గురి చేస్తుందని హెడ్ మాస్టర్లు చెప్తున్నారు.  

ఎగ్జామ్స్​ను బట్టే పెర్ఫామెన్స్​
మంగళవారం సమ్మెటివ్–1 ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. స్టూడెంట్లు సరిగా రాయలేకపోతున్నారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య వరకు బేసిక్ లైన్ సెషన్స్ నిర్వహించాం. ఆ తర్వాత నుంచి సీరియస్​గా సిలబస్ చెప్తున్నాం. ఇప్పటికి ఇంకా 10, 15 శాతం సిలబస్ పెండింగ్​లో ఉంది. రివిజన్​కి టైం ఉండడం లేదు. ప్రస్తుతం పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్ ని బట్టి వాళ్ల పెర్ఫామెన్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది.- రేణు, హెచ్ఎం, వెంకటరావు మెమోరియల్ హైస్కూల్, లాల్ దర్వాజా. 

ఆన్సర్లు బట్టీ పడుతున్నా..
ఇదివరకు క్లాసుల్లో విన్నది, చదివింది గుర్తుండేది. ఇప్పుడు ఎంత ట్రై చేసినా గుర్తుండట్లేదు. ఆన్సర్లు బట్టీ పడుతున్నా.  ఎగ్జామ్ హాల్​లోకి పోయే సరికి అన్ని మర్చిపోతున్నా. స్టడీస్ లో వెనకపడిపోతున్నాననే టెన్షన్ గా ఉంది. లాంగ్వేజ్ లు కొంచెం ఈజీగానే ఉన్నా సైన్స్, మ్యాథ్స్ చాలా కష్టంగా ఉన్నాయి. - ఉమా,7వ కాస్ల్​, షేక్ పేట గవర్నమెంట్ స్కూల్.