వచ్చే నెల ఫస్ట్ నుంచి స్కూళ్లు ఓపెన్​!

వచ్చే నెల ఫస్ట్ నుంచి స్కూళ్లు ఓపెన్​!
  • ముందుగా 8వ క్లాస్​ ఆపై స్టూడెంట్లకు ఫిజికల్ క్లాసులు
  • నేడు అధికారికంగా నిర్ణయం తీసుకునే చాన్స్

స్కూళ్లలో ఫిజికల్ క్లాసులను వచ్చే నెల ఫస్ట్​ నుంచి ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ముందుగా 8వ తరగతి, ఆపైన స్టూడెంట్లకే పరిమితం చేయాలని యోచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్లాసులకు డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే ముందుగా 8వ తరగతి ఆపైన చదువుతున్న స్టూడెంట్లకే పరిమితం చేయాలని యోచిస్తున్నారు. ఫిజికల్ క్లాసుల ప్రారంభంపై శుక్రవారం సమీక్షించి నిర్ణయం ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్, డిజిటల్ క్లాసులు మొదలయ్యాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో, ఫిజికల్ క్లాసులపై డిమాండ్ మొదలైంది. ప్రైవేటు స్కూళ్ల మేనేజ్మెంట్లు, టీచర్ల సంఘాలు, పేరెంట్స్ స్టూడెంట్స్, యూనియన్లు ఫిజికల్ క్లాసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందిస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆగస్టు 16 నుంచి ప్రారంభించాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. పార్లమెంటరీ ప్యానల్‌‌ కూడా బడులు ప్రారంభించాలని లేకపోతే స్టూడెంట్లకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎంవో గురువారం ఫిజికల్ క్లాసుల ప్రారంభంపై వెంటనే వివరాలు అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

విడతల వారీగా అన్ని క్లాసులకు
హాస్టళ్లు, గురుకులాలను దృష్టిలో పెట్టుకుని ముందుగా హైస్కూల్ స్టూడెంట్లకు మాత్రమే ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేయాలని యోచిస్తున్నది. తర్వాత దశలవారీగా ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. హెల్త్ డిపార్ట్​మెంట్ సూచనలు, గైడ్​లైన్స్ ఆధారంగా క్లాసుల నిర్వహణపై కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా సెప్టెంబర్ ఫస్ట్ కంటే ముందే ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.