టాస్​ వేసే సబ్జెక్ట్​ మీద స్టడీ.. బొమ్మా? బొరుసా?

టాస్​ వేసే సబ్జెక్ట్​ మీద స్టడీ.. బొమ్మా? బొరుసా?

క్రికెట్​లో ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి? అనేది తేల్చడానికి మ్యాచ్​కి ముందు టాస్ వేయడం తెలిసిందే. అలా ఒక నాణేన్ని గాల్లోకి ఎగరేస్తే అది భూమ్మీద పడగానే బొమ్మా? బొరుసా? అనేది చూస్తారు. అంటే పైకి ఎగరేసినప్పుడు 50 /50 ఛాన్స్ అనుకుంటాం. అయితే, అది నిజం కాదట! అదెలా అంటున్నారా? అందుకోసం ఒక టీం రీసెర్చ్ చేసి మరీ చెప్పింది.

ఆమ్​స్టర్​డామ్​ యూనివర్సిటీ రీసెర్చర్​ ఫ్రాంటిసెక్​ బర్టొస్... ఇతను 48 మంది టీంతో కలిసి ‘టాస్’​ వేసే సబ్జెక్ట్​ మీద స్టడీ చేశారు. మామూలుగా అయితే టాస్​ అనేది 50 /50 ఛాన్స్ అని అనుకుంటారు. అది నిజమా? కాదా? అనేది తెలుసుకునేందుకే ఆమ్​స్టర్​డామ్​ యూనివర్శిటీ వాళ్లు ఈ స్టడీ చేశారు. అందులో భాగంగా టీం అంతా కలిసి 46 కరెన్సీలకు సంబంధించి 350,757 నాణేలను టాస్​ వేశారు. దాంతో రిజల్ట్​ 50 /50 ఛాన్స్ కాదని తేలిపోయింది. అంతేకాదు చాలావరకు బాగున్న కాయిన్లు(ఎక్కువ వాడనివి) పైకి ఎగరేసేటప్పుడు ఎలా ఉన్నాయో అలానే కింద పడేవి. ఇలా పడిన కాయిన్ల శాతం 50.8 అని తేల్చేశారు.