Good Idea : నిమ్మకాయలతో పచ్చడే కాదు.. కరెంట్ కూడా తయారు చేయొచ్చు..!

Good Idea : నిమ్మకాయలతో పచ్చడే కాదు.. కరెంట్ కూడా తయారు చేయొచ్చు..!

నిమ్మకాయలతో పచ్చడి పెట్టుకుంటాం. జ్యూస్ చేసుకొని తాగుతాం. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లో టేస్ట్ కోసం నిమ్మరసం కలుపుతాం. కానీ, ఈయన అలా కాదు. నిమ్మకాయలతో కరెంటు బ్యాటరీలు తయారుచేశాడు. ఆ బ్యాటరీలతో కారు బ్యాటరీని ఛార్జ్ చేశాడు కూడా. పర్యావరణాన్ని పొల్యూట్ చేయకూడదనే అతని ఆలోచనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఇతనొక సైంటిస్ట్. పేరు షైపుల్ ఇస్లాం.

షైపుల్ ఇస్లాం.. లండన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అనే ఆర్గనైజేషన్ లో సైంటిస్ట్. 2,923 నిమ్మకాయలతో బ్యాటరీ ఎక్స్పరిమెంట్ చేసి, 2,307 వోల్ట్స్ ల కరెంట్ ను తయారుచేశాడు. అందుకే అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ ఎక్స్ పరిమెంట్ని 2017 లోనే మొదటిసారి చేశాడు. షైపుల్. వెయ్యి నిమ్మకాయలను ముక్కలుగా చేసి, వాటి ద్వారా 1,274 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీని తయారు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ఈసారి2,923 నిమ్మకాయలతో 2.307 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ తయారు చేశాడు. పండ్ల నుంచి ఎక్కువ వోల్టేజ్ కరెంట్ తయారు చేసి, రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ కరెంట్ తోనే గో-కార్ట్ రేస్ కార్ బ్యాటరీని ఛార్జ్ చేశాడు. అంతేకాదు కారును స్టార్ట్ చేసి నడిపించాడు కూడా. 

ఎక్స్ పరిమెంట్ ఇలా..

నిమ్మకాయలకు ఒకపక్క జింక్ ప్లేట్, మరోపక్క కాపర్ ప్లేట్ను గుచ్చాడు. నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ జింక్తోతో కలిసి ఎలక్ట్రోడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎలక్ట్రోడ్స్ జింక్ ప్లేట్ లో నుంచి వెళ్లి కాపర్ ప్లేట్ తో కలిసి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్లస్, మైనస్ ఎలక్ట్రోడ్స ని వేరు చేసి వాటికి వైర్లను జాయింట్ చేశాడు. ఆ వైర్ల నుండి వచ్చే కరెంట్ గో-కార్ట్ కారు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు.

వేస్ట్ చేయం..

"కరెంట్ తయారీ కోసం వాడిన నిమ్మ కాయలను వేస్ట్ చేయం. విడ్నెస్ సిటీలో వీటిని ప్రాసెస్ చేసి ఆ వేస్టేజ్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీని, బయోగ్యాస్ ను తయారు చేస్తాం. మిగిలిన చెత్తను పంటలకు ఫెర్టిలైజర్ , కంపోస్ట్ గా వాడుతాం" అని చెప్పాడు ఈ సైంటిస్ట్.

Also Read :రాజకీయాల్లోకి రాను.. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా