దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కోలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధుల వల్ల ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. కానీ దంత సమస్యల వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందట. సౌత్ కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధకుల లేటేస్ట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దంత పరిశుభ్రత సరిగా లేని వారు కూడా గుండె పోటు బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
సౌత్ కరోలినా వర్శిటీ అధ్యాయనం ప్రకారం.. కావిటీస్, చిగుళ్ల వాపు రెండింటితోనూ బాధపడుతున్న వ్యక్తులు స్ట్రోక్‌ను ఎదుర్కొనే అవకాశం 86 శాతం ఎక్కువగా ఉంటుందట. వీరికి ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా శాశ్వత నాడీ సంబంధిత లోపాలు లేదా మరణం సంభవిస్తాయట. సౌత్ కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యాయనంలో భాగంగా 6 వేల మందిని పరీక్షించారు.
ALSO READ : Good Health: చలికి ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉంటోందా.. ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు వర్గాలుగా విభజించారు. -ఆరోగ్యకరమైన నోటి స్థితి ఉన్నవారు, చిగుళ్ల వ్యాధి ఉన్నవారు, కావిటిస్ వ్యాధి ఉన్నవారు. ఈ మూడు వర్గాల వారికి పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూసినట్లు పరిశోధకులు వెల్లడించారు. దంత సమస్యలు లేని వ్యక్తులకు స్ట్రోక్ ఫ్రీక్వెన్సీ 4 శాతం, చిగుళ్ల వ్యాధి ఉన్నవారికి 7 శాతం, చిగుళ్ల వ్యాధితో పాటు దంత క్షయం ఉన్నవారికి10 శాతం స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. సో.. దంత సమస్యలను కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తు్న్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్
