బేగంపేట రైల్వే స్టేషన్‌‌లో అమృత్ సంవాద్

బేగంపేట రైల్వే స్టేషన్‌‌లో అమృత్ సంవాద్
  • ప్యాసింజర్ల నుంచి సలహాలు స్వీకరించిన ఎస్సీఆర్ జీఎం సంజయ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌‌లో శనివారం ‘అమృత్ సంవాద్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. స్టేషన్‌‌లోని ప్యాసింజర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. స్టేషన్ శుభ్రత, ఎస్కలేటర్ సౌకర్యాలు, ట్రైన్‌‌లలో క్యాటరింగ్ సేవలు, భద్రత, నీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు స్పందిస్తూ.. స్టేషన్ శుభ్రతలో మరింత మెరుగులు అవసరమని..లిఫ్టులు, వై-ఫై వంటి సౌకర్యాలు  కల్పించాలని కోరారు.

 సంజయ్ కుమార్ మాట్లాడుతూ.."అమృత్ స్టేషన్ ఇనిషియేటివ్ కింద పునర్నిర్మించిన స్టేషన్లలో బేగంపేట స్టేషన్ ఒకటి. ప్యాసింజర్లు ఇచ్చిన సూచనలను అమలు చేసి వారి రైల్వే ప్రయాణ అనుభవాల్ని మరింత మెరుగుపరుస్తం. స్టేషన్లు, ట్రైన్‌‌లను మరింత క్లీన్ గా ఉంచడానికి,  అదనపు జనరల్ కోచ్‌‌లు అందించడానికి చర్యలు చేపట్టాం. ప్రయాణికులు 'రైల్ వన్ యాప్'ను ఉపయోగించి తమ అభిప్రాయాలు మాతో పంచుకోవాలి" అని సంజయ్ పేర్కొన్నారు.