ఐటీ నోటీసులకు రెస్పాండ్ కాకుంటే స్క్రూటినీ

ఐటీ నోటీసులకు రెస్పాండ్ కాకుంటే స్క్రూటినీ

న్యూఢిల్లీ: ఐటీ నోటీసులకు రెస్పాండ్ కాని ట్యాక్స్ పేయర్లు  (అసెసీలు) ఇక నుంచి స్క్రూటినీ (పరిశీలన) ఎదుర్కోవాల్సిందే.  ప్రభుత్వ లా ఎన్‌‌ఫోర్స్​మెంట్ ఏజెన్సీలు లేదా రెగ్యులేటరీ అథారిటీలు అందించిన ట్యాక్‌‌ ఎగవేత కేసుల్లో కూడా స్క్రూటినీ చేపడతారు. ఆదాయాల్లో  తేడాలు ఉన్నవారికి  ఐటీ చట్టం సెక్షన్ 143 (2) కింద జూన్‌‌ 30 లోపు  ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపుతారు. ఆ తర్వాత అసెసీ  సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

నోటీస్‌‌లకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ట్యాక్స్ చట్టంలోని 142 (1) కింద  కేసును ఫేస్‌‌లెస్‌‌ అసెస్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ (ఎన్‌‌ఏఎఫ్‌‌ఏసీ) కి పంపుతారు. స్క్రూటినీలో భాగంగా  రిటర్న్స్‌‌ ఎప్పుడు ఫైల్ చేశారు, ఎక్కడ ఫైల్ చేశారు వంటి అంశాలపై క్లారిటీ అడగనున్నారు. ఐటీ అధికారులు మినహాయింపులు లేదా డిడక్షన్ల క్లయిమ్స్​ను రిజెక్ట్ చేసినా మళ్లీ మళ్లీ క్లయిమ్స్‌‌  చేసేవారి లిస్ట్​ను ట్యాక్స్ డిపార్ట్​మెంట్ రెడీ చేస్తోంది. వీరికి నోటీసులు పంపనుంది.