గురుకులాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తాం : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

గురుకులాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తాం : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని సీవోఈ, బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం ఆ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయ్​లెట్లు నిర్మించుకోవాలని, కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.

 ఆర్వో ప్లాంట్‌కు రిపేర్లు చేయాలన్నారు. బాలికల రెసిడెన్షియల్ కాళేశ్వరం మల్టీజోనల్ ఆఫీసర్లు అలివేలు, అరుణ కుమారి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నీలా దేవి, శంకర్, రాంబాబు నాయక్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, రూరల్ సీఐ హనుక్ తదితరులు పాల్గొన్నారు.