ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఆత్రం సమ్మక్క కులోన్మాద హత్యపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్మణ్ డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్ లో గోండ్వానా కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, ఆత్రం సమ్మక్క తల్లిదండ్రులు, సోదరితో కలిసి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫ్యామిలీకి న్యాయం చేస్తామని, త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తామని చైర్మన్ తెలిపారు.
