పర్మిషన్ లేనిదే విదేశాలకు వెళ్లొద్దు.. చీటింగ్ కేసులో జరీన్ ఖాన్కు బెయిల్

పర్మిషన్ లేనిదే విదేశాలకు వెళ్లొద్దు.. చీటింగ్ కేసులో జరీన్ ఖాన్కు బెయిల్

చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన చీటింగ్‌ కేసులో రూ.30 వేల వ్యక్తిగత పూచీకత్తుతో డిసెంబర్ 26వ తేదీ వరకు బెయిల్‌ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పునిచ్చింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

2018లో కోల్‌కతాలో జరిగిన దూర్గా పూజలో పాల్గొనేందుకు నిర్వహకుల నుంచి జరీన్ ఖాన్ రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుందని అభియోగం ఉంది. అయితే ఆ కార్యక్రమానికి రాకపోవడంతో జరీన్‌తోపాటు ఆమె మేనేజరుపై నార్కెల్‌దంగ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో జరీన్ ఖాన్‌కు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.