ఇల్లు అద్దెకు అడిగి ట్రెండ్ సెట్ చేశాడు.. వైరల్ అవుతున్న పోస్ట్

ఇల్లు అద్దెకు అడిగి ట్రెండ్ సెట్ చేశాడు.. వైరల్ అవుతున్న పోస్ట్

రోజుల తరబడి అద్దె ఇంటికి వెతకడం పాత ట్రెండ్.. ‘మాకు అద్దెకు ఇల్లు కావాలి.. మీ ఇల్లు ఖాళీగా ఉంటే చెప్పండి’ అని అడగడం కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 15న జరిగిన బెంగళూరు, ఢిల్లీ మ్యా్చ్ లో అతిన్ బోస్ అనే వ్యాక్తి వినూత్నంగా అద్దె ఇంటిని వెతికే ప్రయత్నం చేశాడు. ‘బెంగళూరు, ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నా.. ఇల్లు అద్దెకు ఉంటే తెలియజేయండి’ అంటూ ప్లకార్డ్ పట్టుకొని మ్యాచ్ కు వచ్చాడు. ఆ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరులో అద్దె ఇంటిని వెతుక్కోవడం చాలా కష్టం. బెల్లందూరు, సర్జాపూర్ రోడ్, జయనగర్, బసవేశ్వరనగర్, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో అద్దెకు చాలామంది ఉంటారు. దాంతో ఆ ప్రాంతంలో ఇళ్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి. 2 బీహెచ్ కే ఫ్లాట్ అద్దెకు కావాలంటే.. నెలకు రూ.45 వేల నుంచి మొదలవుతుంది. అదే 3 బీహెచ్ కే ఫ్లాట్ కావాలంటే.. నెలకు రూ.60వేల నుంచి  రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇంత రేట్లు ఉన్నా అక్కడ ఇల్లు దొరకడం కష్టమే. దాంతో చేసేమి లేక.. క్రికెట్ మ్యాచ్ లో ప్లకార్డు పట్టుకొని ప్రదర్శించినట్లు అతిన్ బోస్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రయత్నంతో అయినా ఇల్లు దొరుకుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నాడు అతిన్.

ఈ పోస్ట్ చూసిన చాలామంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికే ఇలాంటి విచిత్రమైన ప్లాన్స్ చేస్తున్నారని కొందరు అంటుంటే.. ప్లకార్డుల ట్రెండ్ ఏంటిరా బాబు అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొన్న సెంచరీ చేస్తే పెళ్లి చేసుకుంటానని ఒకడు.. నిన్న కప్పు గెలిస్తేనే స్కూల్ కు వెళ్తానని ఇంకొకడు... ఇవాళనేమో ఇల్లు కావాలని ఫ్రీ అడ్వటైజ్మెంట్.. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో.