సిటీలో సీజనల్ ఫీవర్స్.. చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువగా ఎఫెక్ట్

సిటీలో సీజనల్ ఫీవర్స్.. చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువగా ఎఫెక్ట్
  • ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
  • జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజు రోజుకు చలి పెరుగుతుంది. దీంతో సీజనల్​ వ్యాధులు ఎఫెక్ట్ చూపుతుండగా.. పిల్లలు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం, చలికి పొగమంచు, పొల్యూషన్​ కూడా తోడవటంలో ఆస్తమా, అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులు, సీజనల్​ఫీవర్స్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. వింటర్ సీజన్ షురూ అయినప్పటినుంచి పిల్లలు, వృద్ధులు, మహిళలు వందల సంఖ్యలో హాస్పిటల్స్​ముందు క్యూ కడుతున్నారు. ప్రధానంగా లంగ్​డీసీజ్, రైనైటీస్, సైనసైటిస్, థ్రోట్​ఇన్​ఫెక్షన్, చర్మ సంబంధ వ్యాధులు, న్యూమోనియా తదితర వ్యాధుల బారిన పడుతున్నారు.

వందల్లో ఓపీలు

సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో రోజూ వందల్లో ఆస్తమా, అలర్జీ, సీజనల్​ ఫీవర్ల బాధితులు క్యూ కడుతున్నారు. ఎర్రగడ్డలోని చెస్ట్​ ఆస్పత్రిలో గత డిసెంబర్​లో 7 వేల పల్మనాలజీ, 747 డెర్మటాలజీ ఓపీలు నమోదయ్యాయి. ఈ నెల రోజుల వ్యవధిలో 713 మంది లంగ్స్​సమస్యలతో చెస్ట్​హాస్పిటల్​లో అడ్మిట్​అయ్యారు.  ప్రతిరోజూ 300 –400 దాకా లంగ్స్​, అలర్జీ కేసులు చెస్ట్​ హాస్పిటల్​ లో నమోదవుతున్నాయి.  నిన్న ఫీవర్​ హాస్పిటల్​ లో 500 ఓపీలు, నిలోఫర్​ హాస్పిటల్​లో   1300 ఓపీలు వచ్చాయి. బాధితుల్లో ఎక్కువగా వృద్ధులు, పిల్లలు ఉంటున్నారు.

వ్యాక్సిన్ తో అదుపులోకి..

ప్రధానంగా ఇంటర్​స్టీషియల్​లంగ్​డీసీజ్​, రైనైటీస్​, సైనసైటిస్, థ్రోట్​ఇన్​ఫెక్షన్, చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా పిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారు. వీటి నుంచి రక్షణకు వ్యాక్సిన్లు తీసుకుంటే సరిపోతుంది. న్యూమోకోక్​, ఇన్​ఫ్లూయెంజా వ్యాక్సిన్ ను  పిల్లలు, పెద్దలు తగిన మోతాదులో తీసుకుంటే వ్యాధులను అదుపులో పెట్టొచ్చు.  వ్యాధుల బారిన పడకుంటే వ్యాక్సిన్  తీసుకుంటే రాకుండా కొంత రక్షణ పొందేందుకు దోహదం చేస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

బయటకు వెళ్లాల్సి వస్తే..

వింటర్ తగు జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్​వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వారే అప్రమత్తంగా జాగ్రత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. పొల్యూషన్​ ఎక్కువగా ఉండే పొగమంచు ఊపిరితిత్తులకు హాని చేస్తుందని, అందుకు ఉదయం, రాత్రి వేళ బయటకు రాకపోవడమే మంచిదిని  అంటున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వెచ్చని దుస్తులు, స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని చెబుతున్నారు. ఎక్కువగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవాలని. రూమ్​లో వెలుతురు ఉండేలా చూసుకోవాలంటున్నారు.  దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలని, రెండు మూడు రోజులైనా తగ్గకుంటే డాక్టర్ ను సంప్రదించాలని పేర్కొంటున్నారు.

 జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రస్తుతం ఇన్​ఫెక్షన్ వ్యాధులతో ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్లుపై ఎఫెక్ట్ చూపుతుంది. ఆస్తమా, అలర్జీ సమస్యలు ఉన్నవాళ్లకు  వైరస్ తోడవటంతో​లంగ్స్​మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. వ్యాక్సిన్​ తీసుకొని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు.  

– ప్రొఫెసర్​ఎం. నరేందర్, పల్మనాలజీ హెచ్ఓడీ, చెస్ట్​ హాస్పిటల్​