వరల్డ్​వార్ నాటి బాంబు.. ఇప్పుడు పేలింది

వరల్డ్​వార్ నాటి బాంబు.. ఇప్పుడు పేలింది

బెర్లిన్: జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని పంట పొలాల్ లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. సుమారు 10 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడడంతో పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని సైనికుల ట్రైనింగ్ కోసం ఉపయోగించేవారని అధికారులు చెప్పారు. ఇంత శక్తిమంతమైన బాంబు దాదాపు 75 ఏళ్ల పాటు పేలకుండా ఉండి పోవడంపై బాంబ్ స్క్ వాడ్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాంబు అవశేషాలు ఏవైనా దొరికితే అది ఎలాంటి బాంబనే విషయం తెలుస్తుందని వారు చెప్పారు. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన సమయంలో ఆ చుట్టుపక్కల రైతులు ఎవరూ లేరని చెప్పారు. ఇటీవలే బెర్లిన్ లో బిల్డింగ్ కట్టడానికి పునాది తీస్తుండగా వంద కిలోల బాంబు బయటపడింది.