రెండు హెల్మెట్స్ కామన్ కదా.. రెండో హెల్మెట్ బండికి ఎక్కడ పెట్టాలి

రెండు హెల్మెట్స్ కామన్ కదా.. రెండో హెల్మెట్ బండికి ఎక్కడ పెట్టాలి

బైక్‌ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను కొన్ని ప్రదేశాల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే షాపింగ్​ వెళ్లినప్పుడు బైక్​ ను పార్క్​ చేసినప్పుడు ఒక హెల్మెట్​ పెట్టుకొనేందుకు డిక్కీలోనో.. సీటు కిందో పెట్టుకొనేందుకు అవకాశం ఉంటుంది.  కాని ఇప్పుడు రెండో హెల్మెట్​ ఎక్కడ భద్ర పరచాలి అనే విషయం గురించి వాహన దారులు సతమతమవుతున్నారు.  అయితే ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రెండో హెల్మెట్​ ను ఎక్కడ పెట్టాలో సోషల్​ మీడియాలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాడు. 

 ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు, అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం బైక్​ డ్రైవింగ్​ చేసేటప్పుడు హెల్మెట్​ పెట్టుకోవాలని రూల్​ పెట్టారు.  అంతేకాదు ఇప్పుడు బైక్​ నడిపే వ్యక్తే కాదు.. వెనుక కూర్చున్న వ్యక్తి కూడా శిరస్త్రాణం ( హెల్మెట్​) ధరించాలంటున్నారు పోలీసులు. దీంతో వాహనదారులు కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. స్కూటర్ రైడర్స్ కోసం, ఒక హెల్మెట్ ఉంచడానికి సీటు లోపల ఖాళీని తయారు చేస్తారు, కానీ మరొక హెల్మెట్ భద్రపర్చాలంటే  స్థలం ఉండదు .  అయితే ఇప్పడు  రెండో హెల్మెట్‌ని కూడా భద్రపర్చేందకు కొన్ని కంపెనీలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 

రెండో హెల్మెట్​ బైక్​ లో ఎక్కడ పెట్టాలని సోషల్​ మీడియాలో నెటిజన్స్​ అడిగిన ప్రశ్నకు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సమాధానం ఇచ్చాడు.  స్కూటర్‌లో  ఉండే రహస్య హుక్‌ను వీడియో ద్వారా  ప్రజలకు చూపించాడు.  దీనికి రెండో  హెల్మెట్‌ను వేలాడదీయవచ్చని తెలిపాడు.   వీడియోలో చూపించిన వివరాల ప్రకారం  ఆ వ్యక్తి ముందుగా స్కూటర్ సీటు కింద ఉండే డిక్కీని తెరిచాడు.  అందులో రెండు హుక్స్​ ను ఉన్నాయి.  ముందుగా రెండో  హెల్మెట్‌ను  హుక్‌ కు వేలాడదీశాడు. ఇది సీటుకు అటాచ్​ చేయబడి ఉంది. హెల్మెట్ సురక్షితంగా లాక్ చేయబడింది.