
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకాంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 2,500 కిలోల వివిధ కూరగాయలతో ఆలయం అంతా అలంకరించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు.
మరోవైపు, అమ్మవారికి అత్తిలి కుటుంబ సభ్యులు శుక్రవారం తొలిబోనం సమర్పించారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ ఇంటి వద్ద బోనానికి పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. జోగిని శ్యామలకు బోనం ఎత్తారు. అనంతరం డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. సినీ గాయని మధుప్రియ జోడు బోనం ఎత్తుకున్నారు.