జహంగీర్పురిలో ఉద్రిక్త పరిస్థితులు

జహంగీర్పురిలో  ఉద్రిక్త పరిస్థితులు

ఢిల్లీలోని జహంగీర్ పురిలో పోలీసులు భారీగా మోహరించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో ప్రాంతంలో హింస జరిగింది. దీంతో.. జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హడావుడిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కొన్ని నిర్మాణాలు కూల్చివేయగా...సుప్రీం జోక్యం చేసుకుంది. స్టేటస్ కో పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది.దీంతో జహంగీర్ పురిలో భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించారు. 

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

పేషెంట్లను ప్రైవేటుకు  పంపితే కేసులు