ఉగ్రదాడి భగ్నం..భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఉగ్రదాడి భగ్నం..భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.  శ్రీనగర్‌ లోని -బారాముల్లా నేషనల్ హైవేపై  జంగం ఫ్లైవర్‌ దగ్గర జులై 31వ తేదీ ఉదయం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్ ను  గుర్తించారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత భద్రతా బలగాలు బాంబు ను  డిస్పోజల్‌ చేశాయి. 

బారాముల్లా నేషనల్ హైవేపై  ప్రతీ రోజూ భద్రతా దళాల కాన్వాయ్‌లు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను పెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. మొదట జంగం ఫ్లై ఓవర్ దగ్గర బ్యాగ్ ను గుర్తించారు. దీంతో అక్కడకు సీఆర్‌పీఎఫ్‌ దళాలు చేరుకున్నాయి. ఆ వస్తువును ఐఈడీగా అనుమానించి.... జమ్మూకశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందించాయి. వీరితోపాటు సైన్యానికి చెందిన 29వ రాష్ట్రీయ రైఫిల్స్‌ బృందాలు ఘటన స్థలానికి  చేరుకొన్నాయి. అనంతరం బాంబుస్క్వాడ్‌ దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది.