మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా

మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా

మహబూబాబాద్ జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్స్ అందోళనకు దిగారు. పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలంటూ.. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. తమకు ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న సాయి ఏజెన్సీ సంస్థను వెంటనే రద్దు చేయాలని సెక్యూరిటీ గార్డులు, స్వీపర్స్ డిమాండ్ చేశారు. వేతనాల నిర్వహణలో జరిగిన అవకతవకలపైనా విచారణ చేపట్టాలని కోరారు. 

తమకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని చాలాసార్లు ఉన్నతాధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ధర్నా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కనీస వేతనం అమలు చేయాలని సెక్యూరిటీ గార్డులు, స్వీపర్స్ డిమాండ్ చేశారు. తమకు ESI, PF సౌకర్యం వర్తింపజేయాలని కోరారు.