IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఢిల్లీ సూపర్ ప్లాన్.. బ్రూక్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్

IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఢిల్లీ సూపర్ ప్లాన్.. బ్రూక్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్

ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు ముందు కీలక మార్పు చేసింది. ఐపీఎల్ 2025లో సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లకు   హ్యారీ బ్రూక్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సెదికుల్లా అటల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. బుధవారం (మే 7) ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సెడికుల్లా అటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారికంగా  ప్రకటించింది. ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అర్ధాంతరంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో బ్రూక్ పై రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా బ్యాన్ చేసింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ 2025, 2026 ఐపీఎల్ సీజన్స్లో ఆడడానికి వీలు లేదు. వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా రెండేళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నియమనిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ రూల్ విధించిన తర్వాత నిషేధం ఎదర్కొన్న తొలి ఆటగాడు బ్రూక్. దీంతో ఐపీఎల్ తదుపరి  రెండు సీజన్ లలో బ్రూక్ స్థానంలో అటల్ కొనసాగనున్నాడు.   

ALSO READ | Team India: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

అటల్ గత ఏడాది కాలంగా ఆఫ్ఘనిస్తాన్ లో అత్యంత నిలకడైన బ్యాటర్ గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టాపార్డర్ బ్యాటర్ టీ20 ఫార్మాట్ లలో 49 మ్యాచ్‌లు ఆడి 13 హాఫ్ సెంచరీలతో 34 సగటుతో 1507 పరుగులు చేశాడు. 2023లో కాబూల్ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్‌లో 48 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్ లో అటల్ కేవలం 56 బంతుల్లో 118 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. గత సంవత్సరం, ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయంలో అటల్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 368 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. వారి తదుపరి మ్యాచ్ మే 8న గురువారం పంజాబ్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11లో ఢిల్లీ క్యాపిటల్స్ అటల్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.