- కలెక్టర్ కుమార్ దీపక్
- చందారంలో విత్తన ఉత్పత్తి, శుద్ధి కేంద్రం ప్రారంభం
లక్సెట్టిపేట, వెలుగు: రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేట మండలం చందారంలో గ్రామ రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి,- విత్తన శుద్ధి కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా అనేక చర్యలు చేపడుతోందన్నారు.
జిల్లాలోని రైతుల కోసం విత్తన ఉత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇందుకోసం అవసరమైన మెటీరియల్, ఎక్విప్మెంట్ ను సమకూర్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుతో పాటు దాదాపు 22 వేల టన్నుల మక్కజొన్నలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం, పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
