Astrology: పొదున్నే ఇవి చూశారా.. ఇక అంతా శుభమే..

Astrology: పొదున్నే ఇవి చూశారా.. ఇక  అంతా శుభమే..

మనకు ఏదైనా అనుకోని ఘటన ఎదురైతే.. అబ్బ ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూశాం.. ఇలాంటి ఘటన జరిగింది అనుకుంటాం.  ఉదయం మంచిగా ఉంటే ఆరోజంతా మంచిగానే ఉంటుందని నమ్ముతారు.  అందుకే హిందువులు ఉదయం సమయాన్ని చాలా ప్రత్యేకంగా  పరిగణిస్తారు.  ఉదయం వేళలో ఏదైనా చెడు జరిగితే ఆరోజంతా వారికి ఏదో జరుగుతుందని అభిప్రాయపడుతుంటారు.  అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం నిద్రలేవడంతోనే కొన్ని వస్తువులు చూస్తే చాలా శుభప్రదమని చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . - -

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత మీ అరచేతులను చూడటం వల్ల అంతా మంచే జరుగుతుంది అంటారు. విశ్వాసాల ప్రకారం, తల్లి సరస్వతితో పాటు, బ్రహ్మ, లక్ష్మి కూడా చేతిలో నివసిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎల్లవేళలా సంతోషం, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయి.

 ఆవును చూడటం:  ఆవును హిందువులు గోమాతగా పూజిస్తారు.  ఆవులో అనేకమంది దేవతలు.. దేవుళ్లు ఉంటారని పండితులుల చెబుతుంటారు. అలాంటి ఆవును ఉదయం పూట  చూస్తే చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున నిద్రలేస్తూనే ఆవును చూస్తే ఆరోజు వారికి  పెద్ద ఆర్థిక లాభం పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

 తెల్లని పూలు: తెల్లవారుజామున తెల్లటి పువ్వులు కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది లక్ష్మీదేవి నిరంతర అనుగ్రహానికి సంకేతమని నమ్ముతారు.

 పాలు లేదా పాల ఉత్పత్తులు:  మీరు ఉదయం పాలు లేదా పాల ఉత్పత్తులను చూసినట్లయితే అది మంచి సంకేతం. సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు నిలిచి ఉంటాయని ఇది సూచిస్తుంది.

 క్లీనింగ్:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ..ఎవరైనా ఉదయాన్నే ఊడ్చడం లేదా శుభ్రం చేయడం చూస్తే, మీరు ఏదైనా పెద్ద సమస్య నుండి బయటపడవచ్చని అర్థం.

 ఆలయ గంట వినడం: మీరు ఉదయం ఆలయ గంటను వింటే అది శుభ సంకేతం. ఇది జరిగితే కొన్ని శుభవార్తలు అందుకోవచ్చని భావిస్తున్నారు.

పక్షి కిలకిలరావాలు: మీరు ఉదయాన్నే పక్షి కిలకిలరాగాలు విన్నా లేదా అందమైన పక్షిని చూసినా మీ రోజు చాలా చక్కగా సాగుతుందని అర్థం.