పులివెందుల నుంచి వస్తున్న కారు చెక్ చేస్తే.. పోలీసులకు మతిపోయింది

పులివెందుల నుంచి వస్తున్న కారు చెక్ చేస్తే.. పోలీసులకు మతిపోయింది

కడప: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన కట్టుదిట్టమైన ఎన్ని ఏర్పాట్లు చేసినా తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద  తనిఖీలు చేస్తున్న పోలీసులకు మతిపోయింది. పులివెందుల వైపు నుంచి వస్తున్న ఓ కారును అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే 2.7 కేజీల బంగారు ఆభరణాలు దొరికాయి. సీఐ హరినాథ్ కథనం ప్రకారం.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వస్తున్న ఓ కారును నిలిపివేశారు. ఈ సందర్భంగా కారులో తనిఖీ చేయగా సాధారణంగా కనిపించే రెండు బ్యాగుల్లో 2.7 కేజీల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వెంటనే కారు డ్రైవర్‌ మహమ్మద్‌ షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పులివెందులలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం నుంచి మెరుగు పెట్టించడానికి ప్రొద్దుటూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోవటంతో కారుతో పాటు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.05 కోట్లు ఉంటుందని సీఐ హరినాథ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు.

For More News..

దర్శనం చేయిస్తానని భక్తులకు టోకరా వేసిన దళారి

న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం అందరికీ స్ఫూర్తి దాయకం

కూతురితో కలసి రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకింది

అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు