సెల్​బేలో రూంబా వాక్యూమ్​ క్లీనర్

సెల్​బేలో రూంబా వాక్యూమ్​ క్లీనర్

హైదరాబాద్​, వెలుగు : ఎలక్ట్రానిక్స్​ ప్రొడక్టులు అమ్మే రిటైల్​ చెయిన్​ సెల్​బే సంస్థ హైదరాబాద్​లోని తమ మాదాపూర్ షో రూమ్ లో ఐరోబోకు చెందిన రూంబా వాక్యూమ్ ​క్లీనర్​ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా కు చెందిన ఐరోబో కంపెనీ గత 30 సంవత్సరాలుగా రోబో వాక్యూమ్​ క్లీనర్​ రంగంలో సేవలు అందిస్తూ మార్కెట్ లీడర్​గా కొనసాగుతోంది.  మనదేశంలో ఈ ప్రొడక్టును మొదట ముంబై మార్కెట్ లో లాంచ్ చేశారు.

హైదరాబాద్ మార్కెట్ లో మొదటిసారిగా సెల్​బే షో ద్వారా ఇది అందుబాటులోకి వచ్చింది. ఐరోబో యాప్​ ఇంటిగ్రేషన్​ సాయంతో ఈ మెషీన్ చాలా సమర్థవంతంగా పని చేస్తుంది.  ఈ సందర్భంగా సెల్​బే ఫౌండర్​ సోమా నాగరాజు మాట్లాడుతూ, వాక్యూమ్​ క్లీనర్​ ప్రతి ఇల్లాలికి పని ఒత్తిడి తగ్గిస్తుందని చెప్పారు. ఈ ప్రొడక్టును మొదటి సారిగా సెల్​బే షోరూంల ద్వారా తమ కస్టమర్ లకు అమ్మే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఐరోబో సేల్స్ హెడ్  సంజయ్  మాట్లాడుతూ ఈ ప్రొడక్టు3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమం లో సెల్​బే డైరెక్టర్లు సుహాస్ నల్లచెరు , సుదీప్ నల్లచెరు, డిస్ట్రిబ్యూటర్ రాక్ ఫిలిప్​ పాల్గొన్నారు.