ఆర్మూర్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9, 10, 11 తేదీల్లో జరుగనున్న 53వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన ఎంపిక పోటీల్లో పురుషుల విభాగంలో 50 మంది క్రీడాకారులు, మహిళల విభాగంలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారి గటడి రాజేశ్, పీఈటీలు సంజీవ్, రాజేందర్, భాగ్య, అనూష, ప్రిన్సిపాల్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.