అత్యపాత్య -రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

అత్యపాత్య -రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

కోల్​బెల్ట్, వెలుగు: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో నైపుణ్యాన్ని చూపించి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా అత్యపాత్య సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాండ్ల సమ్మయ్య,పెద్దపల్లి ఉప్పలయ్య ఆకాంక్షించారు. అత్యపాత్య రాష్ట్రస్థాయి టోర్నమెంట్​లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఎంపిక పోటీలను బుధవారం రామకృష్ణాపూర్​ సింగరేణి ఠాగూర్​స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఎన్నో కొత్త క్రీడా పాలసీలను ప్రవేశపెడుతోందన్నారు. 

ఈనెల10న హైదరాబాద్​సరూర్​నగర్​లో రాష్ట్రస్థాయి అత్యపాత్య పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ప్రకటించారు. బాలికల జట్టులో ఆర్.అక్షిత,టి.వైష్ణవి,కల్పన, గణశ్రీ, లక్ష్మి, బాలుర జట్టుకు బి.సాయి సహజ్, విహాన్​రీదిశ్, అంజిత్, రిత్విక్ శ్రీకర్​ ఎంపికైనట్లు తెలిపారు. ఉపాధ్యక్షులు కనపర్తి రమేశ్, సంతోష్, దేవేందర్, కోశాధికారి వర్ష, పిడిలు తదితరులు పాల్గొన్నారు.