
హైదరాబాద్, వెలుగు : సిటీలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ చివరి వారం నుంచి న్యూ ఇయర్ దాకా సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సిటీలోనూ క్రిస్మస్ వేడుకలకు ప్రధాన చర్చిలు ముస్తాబు అవుతుండగా.. పండుగ ముందు నిర్వహించే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగాక్రిస్టియన్లు ప్రేయర్స్, క్యారెల్స్, డ్రామాలు, సింగింగ్, డ్యాన్స్‌లు, క్యాండిల్ నైట్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా ట్రీస్, కలర్స్, స్టార్స్, స్టిక్కర్స్‌తో అలంకరిస్తున్నారు. క్యారల్స్నిర్వహిస్తున్నారు. క్యాండిల్ నైట్సర్వీసులు, క్రీస్తు పుట్టుక, ఆనాటి పరిస్థితులను ప్రతిరోజు ఒక్కో ప్రోగ్రామ్‌తో సెమీ వేడుకలను చేస్తున్నారు.
కస్టమర్లను ఆకట్టుకునేలా..క్రిస్మస్ సమీపిస్తుండగా సిటీలో షాపింగ్‌మాల్స్‌లో సందడి నెలకొంది. నిర్వాహకులు కూడా శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి కస్టమర్లను ఫెస్టీవ్మూడ్లోకి తీసుకెళ్తున్నారు. అలంకరణకు స్టార్స్, శాంటాక్లాజ్ డ్రెస్‌లు, క్యాప్‌లు, బెల్స్, హ్యాంగింగ్స్, బెలూన్స్, కలర్బాల్స్, కలర్బెల్స్అమ్మకాలు జోరందుకున్నాయి. సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో స్టార్స్, శాంటాక్లాజ్ క్యాప్‌లు, డ్రెస్సులతో స్టాల్స్ కూడా వెలిశాయి.
ఎక్కువగా కొనుగోలు
పండుగ సందర్భంగా చర్చ్‌లను, ఇండ్లను డెకరేట్ చేసుకుంటాం. ప్రతి ఏడాది క్రిస్మస్కు డెకరేషన్ ఐటమ్స్ అమ్మకానికి పెడుతుంటా. శాంటాక్లాజ్ డ్రెసెస్, క్యాప్స్, క్రిస్మస్ ట్రీస్, స్టార్స్ ఎక్కువగా సేల్ అవుతుంటాయి. ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
– ఫ్లోరా రాజకుమారి, డెకరేషన్ షాప్ నిర్వాహకురాలు, సికింద్రాబాద్
ప్రతి ప్రోగ్రామ్‌తో ఆనందం
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించే సెమీ క్రిస్మస్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ ప్రేమ, కరుణ, ఆనందంతో చేసేవే. వీటిని అందరూ అలవర్చుకోవాలి. భక్తి శ్రద్ధలతో క్రీస్తు పుట్టిన రోజును నిర్వహించుకోవాలి.
– జాన్రూపస్, ఫెయిత్ సిటీ చర్చ్, హైదరాబాద్