పెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి

పెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి
  • మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం హెల్త్ సెంటర్ లో ఘటన

నర్సింహులపేట, వెలుగు: డ్యూటీలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన సీనియర్ ఏఏన్ఎం బంటు ఈవ(58), నర్సింహులపేట మండలం పెద్దనాగారం హెల్త్ సబ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తుంది. బుధవారం డ్యూటీకి వెళ్లగా.. దంతాలపల్లి పీహెచ్ సీ నుంచి వ్యాక్సిన్స్  తీసుకుని పెద్దనాగారం హెల్త్ సెంటర్ కు వచ్చి ఫొటో దిగి అప్ లోడ్ చేసింది. సెంటర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన  కొద్దిసేపటికే ఆమె ఒక్కసారిగా గుండెనొప్పితో కుర్చీలోనే మృతిచెందింది. 

ఆమె భర్త ఏడాది కింద చనిపోయాడు.  కొడుకుకు పెండ్లవగా కోడలు కూడా రెండేండ్ల కింద మృతిచెందింది. చిన్నపిల్లల ఆలనాపాలనా తనే చూసుకునేది. సిన్సియర్ గా డ్యూటీ చేసిన ఆమె ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. జూనియర్ ఏఎన్ఎంలకు ఆదర్శంగానూ నిలిచా రు. సీనియర్ ఏఎన్ఎం మృతిపై హెల్త్ డిపార్ట్ మెంట్ సంతాపం తెలిపింది.