క్షీణించిన ఎల్‌కే అద్వానీకి ఆరోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‪లో చికిత్స

క్షీణించిన ఎల్‌కే అద్వానీకి ఆరోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‪లో చికిత్స

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. ప్రస్తుతం ఆయన వయసు 96ఏళ్లు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే డాక్లర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేయనున్నారు. ఎల్ కే అద్వానీని మార్చి 30, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. కేంద్రంలో హోం మంత్రితోపాటు పలు కీలక పదవుల్లో ఆయన పని చేశారు.