మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి ఇందిర తెలిపారు. సర్వసామాన్య ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
ప్రజలకు కావాల్సిన న్యాయ సలహాలు, సూచనలు అందించేందుకు పారా లీగల్ వలంటర్లు ప్రతి సోమవారం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని చెప్పారు. వారిని సంప్రదిస్తే కావాల్సిన న్యాయపరమైన సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీర, డాక్టర్లు సురేశ్, అమరావతి, లక్ష్మీప్రసన్న, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ప్రేరణ, ఆర్ఎంవో జరీనా పాల్గొన్నారు.

