
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ లో) పని చేస్తున్న వెటరన్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జితేంద్రనాథ్ పాండే (78) కరోనా వైరస్ సోకడంతో చనిపోయారు. ఎయిమ్స్ లోని పల్మనాలజీ డిపార్ట్ మెంట్ కు డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న జితేంత్రనాథ్.. దేశంలో మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి కరోనా పేషెంట్స్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. జితేంద్రనాథ్ మృతిని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ధ్రువీకరించింది. ఆయన వైఫ్ ను డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆమెకు కూడా కరోనా సోకిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి పురోగతిలో జితేంద్రనాథ్ విశేష కృషి చేశారు. పల్మనాలజీ డిపార్ట్ మెంట్ కు ఆర్కిటెక్ట్ గా పని చేసిన ఆయన.. ఆ విభాగానికి హెచ్ వోడీగా పలు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఎయిమ్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ రణ్ దీప్ గులేరియా కూడా జితేంద్రనాథ్ శిష్యుడే కావడం గమనార్హం. ఆయన మృతిపై సీనియర్ డాక్టర్స్ నివాళులు అర్పించారు.