శ్రీనగర్: వింగ్ కమాండర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఓ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని బుద్గామ్ పోలీసులు శ్రీనగర్ వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండేండ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, మానసిక హింసకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెప్పారు. 2023 డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీ సమయంలో వింగ్ కమాండర్ తన ఇంటికి పిలిచి ఓరల్ సెక్స్‌కు బలవంతం చేశాడని, దీంతో అతడిని తోసేసి తప్పించుకున్నానని తెలిపారు.
ఆపై ఎప్పట్లాగే డ్యూటీకి వస్తూ తనపై వేధింపులు మొదలు పెట్టాడని తెలిపారు. ఈ విషయంపై కల్న ల్ ర్యాంక్ అధికారికి ఫిర్యాదు చేయగా.. వారు ప్రత్యక్ష సాక్షులు లేరంటూ కొట్టిపారేశారని పేర్కొన్నారు. ఆపై తన ఫిర్యాదుతో అంతర్గత కమిటీ వేసినప్పటికీ జాప్యం చేస్తూ నిందితుడికి అండగా నిలిచారని బాధితురాలు ఆరోపించారు. అనంతరం తనకు సెలవులు ఇచ్చేందుకు కూడా
నిరాకరిస్తూ వేధించారని ఆరోపించారు.