చెన్నై: భారత మహిళల టెన్నిస్‌లో వైష్ణవి అడ్కర్–రుతుజా భోసలే చరిత్ర సృష్టించారు. డబ్ల్యూటీఏ టూర్ స్థాయి డబుల్స్ ఫైనల్‌కు చేరిన తొలి ఆల్ ఇండియన్ జోడీగా రికార్డు నెలకొల్పారు. శనివారం జరిగిన చెన్నై ఓపెన్ సెమీఫైనల్లో రెండో సీడ్ వెరోనికా ఫాల్కోవ్స్కా (పోలండ్)–అలానా స్మిత్ (అమెరికా) జోడీని 6–2, 2–6, 10–8తో ఓడించారు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన భారత జోడీ రెండో సెట్లో తడబడింది.
దీంతో మ్యాచ్ సూపర్ టైబ్రేకర్‌కు చేరింది. నిర్ణయాత్మక పోరులో ప్రత్యర్థులు 8-6తో ఆధిక్యంలోకి వెళ్లినా.. అడ్కర్, భోసలే అద్భుతంగా పుంజుకున్నారు. వరుస పాయింట్లతో మ్యాచ్ పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. గతంలో భారత మహిళల జోడీలు డబ్ల్యూటీఏ 125 స్థాయిలో ఫైనల్స్‌కు చేరినా.. ప్రధాన డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
