భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

వారాంతంలో దేశీయ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అన్నీ ప్రతికూల సంకేతాలే ఉండటంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులు, జపోరిషియా అణు విద్యుత్ ప్లాంటుపై దాడి ఘటనలు మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం లాస్లో ఉండటం ఇన్వెస్టర్లను తీవ్రంగా కలవరపెట్టింది. క్రూడాయిల్ ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నష్టాలను మరింత పెంచింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోకి రాలేకపోయాయి. 

ఉదయం 54,653.59 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో అమ్మకాల ఒత్తిడితో నమోదైన 53,887.72 ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. మిడ్ సెషన్ అనంతరం 55,013.27 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 768.87పాయింట్ల లాస్తో 54,333.81 -వద్ద ముగిసింది. టైటాన్, మారుతి, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 252.70 పాయింట్ల లాస్తో 16,245.35 వద్ద క్లోజయింది. 

For more news

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

పాకిస్థాన్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు