బ్లాక్ మండే.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

బ్లాక్ మండే.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అన్ని ప్రతికూల సంకేతాలే ఉండటంతో వారంలో తొలి ట్రేడింగ్ సెషన్లోనే దేశీయ మార్కెట్లు బేర్మన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగుతుండటం, ఉక్రెయిన్లో రష్యా, నాటో దళాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో ఏ క్షణమైనా యుద్దం తప్పదన్న వార్తలు ప్రపంచ మార్కెట్లను కుదేలు చేశాయి. ఆ ప్రభావం కాస్తా దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా కనిపించింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు 3 శాతంపైగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. 

ఉదయం 56,720.32 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో.. ఆరంభంలో నమోదైన 57,191.91 పాయింట్లు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. అమ్మకాల ఒత్తిడితో 56,295.56పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కోలుకుని 1747.08 పాయింట్ల నష్టంతో 56,405.84పాయింట్ల వద్ద క్లోజయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగానే నష్టపోయింది. 531.95 పాయింట్ల లాస్ తో 16,842.80 వద్ద ముగిసింది. 

లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ తేడా లేకుండా అన్ని షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలార్జించాయి. టాటా స్టీల్,హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలు భారీగా లాసయ్యాయి.

For more news..

సీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్

కేసీఆర్ కు బీజేపి భయం పట్టుకుంది