ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్ గురువారం అందనంత ఎత్తుకు పాకింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 50 వేల మార్క్‌ను దాటింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడి 50, 126.73 పాయింట్లకు చేరింది. అదేవిధంగా నిఫ్లీ కూడా తొలిసారిగా 14, 700 మార్కును చేరుకుంది. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పతనమైన సెన్సెక్స్.. ఒక్కసారిగా ఊపందుకోవడంతో షేర్ హోల్డర్స్, కంపెనీల యాజమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ. 24,713 కోట్లకు కొనడం.. దాన్ని సెబీ అప్రూవ్ చేయడంతో మార్కెట్లకు కొత్త కళ సంతరించుకుంది. దీనికి తోడు అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం చేయడం కూడా భారత సెన్సెక్స్‌కు బాగా కలిసొచ్చింది. బైడెన్ రాకతో అమెరికా మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. అదే దూకుడు భారత మార్కెట్లపై కూడా కొనసాగుతోంది. పెట్టుబడులపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలు తొలగుతాయనే ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి అనేది కూడా ఒక వాదనగా కనిపిస్తోంది.

For More News..

అమ్ముడుపోని టిక్కెట్‌కు రూ. 12 కోట్ల లాటరీ

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి