స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మూడు రోజులుగా వరుస లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాస్లో ఉండటం మదుపర్లను ప్రభావితం చేసింది. అమెరికా ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచవచ్చన్న వార్తలు ట్రేడింగ్పై ఎఫెక్ట్ చూపాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా నష్టాలు పెరిగేందుకు కారణమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 740కిపైగా పాయింట్ల నష్టంతో 58,177 వద్ద ట్రేడవుతోంది. మారుతి, రిలయన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 230 పాయింట్లు లాసై 17,367 వద్ద కొనసాగుతోంది.
