257 ట్రేడింగ్ సెషన్ల తర్వాత ఆల్ టైం హైకి నిఫ్టీ

257 ట్రేడింగ్ సెషన్ల తర్వాత ఆల్ టైం హైకి నిఫ్టీ

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగినా, ఆసియాలోని మెజార్టీ స్టాక్ ఎక్స్చేంజీలు నష్టాల్లో కదిలినా లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు మాత్రం సోమవారం కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇండెక్స్ హెవీ వెయిట్  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ (3 శాతం అప్‌‌‌‌‌‌‌‌) ర్యాలీ చేయడంతో  గత ఆల్ టైమ్ హై అయిన 18,604 లెవెల్‌‌‌‌‌‌‌‌ను నిఫ్టీ ఈజీగా క్రాస్  చేసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 18,611 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని రికార్డ్ చేసింది. సుమారు 275 ట్రేడింగ్ సెషన్ల తర్వాత ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది.  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ కూడా  ఇంట్రాడేలో 62,701 లెవెల్ వద్ద సరికొత్త ఆల్ టైమ్ హైని ఏర్పరిచింది. నిఫ్టీ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ 17 న 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌ నుంచి చూస్తే ఐదు నెలల్లోనే 22 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో   నిఫ్టీలో ఐటీసీ షేరు ఎక్కువగా పెరిగింది. ఆ తర్వాత ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, ఐషర్ మోటార్స్ షేర్లు ఉన్నాయి. విప్రో, దివీస్‌‌‌‌‌‌‌‌, టెక్ మహీంద్రా షేర్లు 43 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ సోమవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో 211 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 62,505 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 18,563 వద్ద క్లోజయ్యింది.

మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నడిపించిన కీలక అంశాలు..

1  వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ ఇక నుంచి తక్కువగా పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. కిందటి వారం విడుదలైన ఫెడ్ మీటింగ్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ అంచనాలకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. 
2  కరోనా కేసులు పెరుగుతుండడంతో చైనీస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ రిస్ట్రిక్షన్లను కఠినంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ జీరో కోవిడ్ పాలసీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. చాలా సిటీల్లో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ కొనసాగుతుండడంతో చైనా ఎకానమీ  స్లో అవుతుందని, క్రూడాయిల్ వాడకం పడిపోతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. మరోవైపు యూరప్‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎకానమీలు కూడా స్లో డౌన్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ ధరలు గత ఏడాది కాలంలో మొదటిసారిగా బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 80 డాలర్లకు దిగొచ్చాయి. ఆయిల్‌‌‌‌‌‌‌‌ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే ఇండియాకు ఇది మేలు చేసే అంశం.

3 డాలర్ వాల్యూ పడుతుండడంతో దేశ రూపాయి బలపడుతోంది. 114.78  లెవెల్ వద్ద  కొన్నేళ్ల గరిష్టానికి చేరుకున్న డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం  106 కి పడిపోయింది. ఫలితంగా 83  వరకు పడిపోయిన రూపాయి బలపడుతోంది.  తాజాగా 81.70 వద్ద సెటిలయ్యింది. మరోవైపు విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు తిరిగి వస్తుండడంతో మార్కెట్‌‌లు పెరుగుతున్నాయి. 
4 దేశంలోని కార్పొరేట్ కంపెనీల క్యూ2 రిజల్ట్స్ మెరుగ్గా ఉన్నాయి.  నిఫ్టీలోని కంపెనీల లాభాలు డల్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని అంచనా వేయగా, ఇవి సగటున 9 శాతం పెరగడం విశేషం.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

 ‘మార్కెట్ ర్యాలీ చేస్తుండడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. క్రూడాయిల్ ధరలు తగ్గుతుండడం, రెండోది..ఫండమెంటల్‌‌‌‌‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న షేర్లలో  విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడం’ అని జియోజిత్ ఫైనాన్షియల్స్‌‌‌‌‌‌‌‌  ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ స్పీచ్ బుధవారం ఉందని, అప్పటి వరకు మార్కెట్ వేచి చూసే ధోరణిని అనుసరించొచ్చని అన్నారు. పావెల్ స్పీచ్ నెగెటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటే మార్కెట్ పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ఎకానమీ బలంగా ఉండడం, కంపెనీల రిజల్ట్స్ బాగుండడం, ఆయిల్ ధరలు భారీగా పడడం దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌లకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్నాయి. ఈ ముమెంటం కొనసాగుతుంది’ అని మోతీలాల్‌‌‌‌‌‌‌‌ ఓస్వాల్ ఎండీ అజయ్‌‌‌‌‌‌‌‌ మినాన్ అన్నారు. 

ఏడాదిలో 80 వేలకు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బాండ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో  ఇండియాకు అవకాశం దొరికితే సెన్సెక్స్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 80 వేలకు చేరుకుంటుందని ఫారిన్ బ్రోకరేజ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది.  ఇదే జరిగితే 12 నెలల్లో దేశంలోకి రూ.1.6 లక్షల కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ వస్తాయని పేర్కొంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బాండ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే దేశ బాండ్లకు చోటు దొరకాల్సి ఉంది. కానీ, దేశంలోని బాండ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూల్స్‌‌‌‌‌‌‌‌ను, ట్యాక్స్ నియమాలను సులభతరం చేయాల్సి ఉంది. అందుకే గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో ఇండియాకు చోటు దొరకడం వాయిదా పడిందని ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు తగ్గుతున్న  ఆయిల్‌‌‌‌‌‌‌‌, ఫెర్టిలైజర్స్ ధరలు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌  80 వేల మార్క్‌‌‌‌‌‌‌‌ను అందుకోవడంలో సాయపడతాయని  ఈ బ్రోకరేజ్ కంపెనీ వివరించింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌–రష్యా యుద్ధ ప్రభావం వచ్చే ఏడాది ఉండదని, యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకోదని, ప్రభుత్వ పాలసీల మద్ధతు కొనసాగుతుందనే అంచనాలతో మోర్గాన్ స్టాన్లీ ఈ టార్గెట్‌‌‌‌‌‌‌‌ వేసింది.