
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu 7) కంటెస్టెంట్ అమర్ దీప్ (Amardeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ లో తన ఆటతీరుతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి ఐదువారాలు అటూ ఇటుగా సాగిన అమర్ ఆట.. ఆ తర్వాత వీక్ నుంచి గాడిలో పడింది. తన ఆటకు ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అమర్ టైటిల్ గెలవడం కష్టం అనుకున్న స్టేజి నుండి.. టైటిల్ రేస్ లో టాప్ లో నిలిచే స్థాయికి చేరుకున్నాడు.
ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా అమర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. అమర్ కు ఫిట్స్ వచ్చాయని, అందుకే బిగ్ బాస్ మెడికల్ రూమ్ కు పిలిచారని, ట్రీట్ మెంట్ కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే విషయంపై తాజాగా అమర్ స్నేహితుడు, జానకీ కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల (Naresh Lolla) స్పందిచారు.
అమర్ గురించి నరేష్ మాట్లాడుతూ.. అమర్ కు ఫిట్స్ అని వస్తున్న వార్తలు నిజమే. అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి అమర్ బయటికి వచ్చాక మాట్లాడుతాను. ఇప్పుడు కాదు.. నీతోనే డాన్స్ అనే షోలో పాల్గొంటున్నప్పటి నుండి ఆ సమస్య మొదలైంది. ఆ షో వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ఒత్తిడికి లోనయ్యాడు అమర్. దాంతో నేను అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేయించాను. అమర్ కు కండరాల ఎదుగదల లేదని డాక్టర్స్ చెప్పారు. ఆ కారణంగానే అమర్ ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాడు. శరీరం శరీరం కూడా సహకరించడం లేదు. అయినా కూడా అమర్ ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు, గేమ్ లోనూ చూపించలేదని చెప్పుకొచ్చారు.. నరేష్.