రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆర్య, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో సమావేశం నిర్వహించారు.
ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని , నోడల్ అధికారులు అవసరమైతే వారి కార్యాలయం నుంచి లేదా ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించుకోవాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలన్నారు. ఎక్కడ అలసత్వానికి తావివ్వవద్దని, ఎన్నికల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
