100 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసుల డెలివరీ.. గేట్స్ ఫౌండేషన్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్ డీల్

100 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసుల డెలివరీ.. గేట్స్ ఫౌండేషన్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్ డీల్

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ వ్యాక్సిన్‌ డీల్‌లో భాగంగా గావితో పాటు గేట్స్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది. ఇండియాతోపాటు ఇతర అల్ప ఆదాయ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌లు అందించడానికి 100 మిలియన్‌లు తయారుచేసే డీల్‌పై ఎస్‌ఐఐ సంతకాలు చేసింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర 3 డాలర్లు ఉంటుందని, వీటిని 92 దేశాల్లో గావికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్ (ఏఎంసీ)లో అందుబాటులోకి ఉంచుతామని పేర్కొంది.

బిల్‌గేట్స్, గేట్స్‌ ఫౌండేషన్‌, గావిసేత్‌కు ఈ భాగస్వామ్యం విషయంలో నేను కృతజ్ఞతలు చెబుతున్నాని అధర్ పూనావల్లా ట్వీట్ చేశారు. అతి తక్కువ ధరలో ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేయడానికి యత్నిస్తున్నామని చెప్పారు. రీసెంట్‌గా ఆస్ట్రా జెనెకా, నోవావ్యాక్స్ కంపెనీలతో కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌ కోసం అధమ్ పూనావల్లాకు చెందిన సీరం జత కలిసింది. ఈ డీల్‌లో కూడా వ్యాక్సిన్‌ను ఒక్కో డోస్‌ను 3 డాలర్లకే అందించాలని నిర్ణయించారు.