ఏడు నెలల కనిష్టానికి పీఎంఐ

ఏడు నెలల కనిష్టానికి పీఎంఐ

న్యూఢిల్లీ: ఉత్పత్తిలో మందగమనం కారణంగా సేవల రంగ వృద్ధి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడునెలల కనిష్టానికి పడిపోయింది. కొత్తవ్యాపారం, పోటీ పరిస్థితులు, ధరల ఒత్తిళ్ల వంటి సవాళ్లను ఎదుర్కొంది. కాలానుగుణంగా సర్దుబాటు చేసే ఎస్​అండ్​పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58.4కి పడి పోయింది. ఇది సెప్టెంబరులో 13 సంవత్సరాల గరిష్ట స్థాయి 61కి చేరింది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో, 50 కంటే ఎక్కువ ప్రింట్ అంటే విస్తరణ అని అర్థం కాగా, అయితే 50 కంటే తక్కువ స్కోర్ ఉన్నట్టుగా భావించాలి.  అనేక కంపెనీలు కొత్త కాంట్రాక్టులను పొందగలిగినా, కొన్ని తమ సేవలకు డిమాండ్​ తగ్గింది.