చర్చల ద్వారా పరిష్కరించుకోండి

చర్చల ద్వారా పరిష్కరించుకోండి
  • పుతిన్ కు చైనా ప్రెసిడెంట్ సూచన 

బీజింగ్: చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యాకు చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి రష్యా, ఉక్రెయిన్ లకు సహకారం అందజేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. యుద్ధం ఆపాలని కోరారు. కాగా, మిలటరీ ఆపరేషన్ చేపట్టడానికి గల కారణాలను జిన్ పింగ్ కు పుతిన్ వివరించినట్లు చైనా మీడియా తెలిపింది. ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు జిన్ పింగ్ తో పుతిన్ చెప్పారని పేర్కొంది.